గంగమ్మ ఆలయ భూదానానికి కర్ణాటక భక్తులు విరాళం

గంగమ్మ ఆలయ భూదానానికి కర్ణాటక భక్తులు విరాళం

CTR: కుప్పం గంగమ్మ ఆలయ భూదానానికి పెద్ద ఎత్తున భక్తులు విరాళాలు అందిస్తున్నారు. ఆదివారం కర్ణాటక రాష్ట్రం కేజీఎఫ్ సమీపంలోని కడుగూరు కేసనపల్లికి చెందిన సునీత శివకుమార్ కుటుంబ సభ్యులు రూ.41,250 అందజేశారు. గంగమ్మ ఆలయానికి సంబంధించి ఇటీవల ప్రైవేటు స్థలాన్ని కొనుగోలు చేయగా ఒక్క అడుగుకు రూ.7500 చొప్పున భక్తులు భూదానం చేస్తున్నారు.