ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే
JGL: మెట్‌పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో శ్రీ రేణుకా పుట్ట ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ నిర్వాహకులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.