ప్రజా సమస్యలు తెలుసుకున్న అధికారులు

SKLM :జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో “మీకోసం సమస్యలు పరిష్కార వేదిక” ద్వారా ఫిర్యాదులు స్వీకరణ కొనసాగింది. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదికలో జిల్లా అధికారులు ప్రజల ఫిర్యాదులను పరిశీలించారు. ప్రధానంగా రెవెన్యూ, వ్యవసాయ, విద్యాశాఖల సమస్యల ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయని తెలిపారు.