కేంద్ర సహాయ మంత్రిని కలిసిన పినపాక ఎమ్మెల్యే

కేంద్ర సహాయ మంత్రిని కలిసిన పినపాక ఎమ్మెల్యే

BDK: రైల్వే సహాయక మంత్రి రవనిత్ సింగ్ బిట్టును గురువారం ఢిల్లీలో పినపాక MLA పాయం వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. కూనవరంలో నూతన రైల్వే స్టేషన్ నిర్మాణం, స్టేషన్ అభివృద్ధి, కొత్తగూడెం నుండి అదనపు రైల్వే లైన్లు, గతంలో మాదిరిగా మణుగూరు నుండి 4 రైలు సర్వీస్‌లు పునరుద్దరించాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో MP పోరిక బలరాం నాయక్ ఉన్నారు.