పాఠశాల పక్కనే చెత్త డంపింగ్
ASR: హుకుంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ పక్కన చెత్తను కుప్పలుగా వేయడంతో తీవ్ర దుర్వాసన వ్యాపిస్తోంది. దీనివల్ల పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, చెత్తను తొలగించి శుభ్రం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.