టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడి

KRNL: కోసిగిలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. బుధవారం రాత్రి టీడీపీ కార్యకర్తలు నర్సారెడ్డి, యంకన్న, నాగిరెడ్డిలపై వైసీపీ కార్యకర్తలు వేట కొడవలి, ఇనుపరాడుతో దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. 'మీరు టీడీపీ నాయకుల ఫొటోలు, వీడియోలు స్టేటస్‌లో పెట్టుకుంటారా' అని ప్రశ్నిస్తూ దాడిచేసినట్లు బాధితులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.