VIDEO: శిథిలావస్థలో చెన్నిపాడు కల్వర్టు

GDWL: మానవపాడు మండలం చెన్నిపాడుకు వెళ్లే దారిలో ఉన్న కల్వర్టు శిథిలావస్థకు చేరుకుంది. దీంతో అటుగా ప్రయాణించే వాహనదారులు, ప్రజలు భయపడుతున్నారు. చిన్నపాటి వర్షానికే కల్వర్టుపైకి వరద నీరు వచ్చి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఈ సమయంలో ప్రయాణించడం ప్రమాదకరమని, ఎటువంటి ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.