కాంగ్రెస్‌లో చేరిన మాజీ సర్పంచ్ దంపతులు

కాంగ్రెస్‌లో చేరిన మాజీ సర్పంచ్ దంపతులు

BHPL: మహదేవపూర్ మండలం కుదురుపల్లె గ్రామ మాజీ సర్పంచ్ గట్టయ్య-సరిత దంపతులు BRSను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, చల్ల తిరుపతిరెడ్డి, గ్రంథాలయ ఛైర్మన్ కొట్టగిరి రాజబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా దంపతులు కాంగ్రెస్ సేవలను ప్రశంసిస్తూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.