అలా ఆదేశాలు… ఇలా ఆచరణ

అలా ఆదేశాలు… ఇలా ఆచరణ

NRML: నిర్మల్ పట్టణంలోని స్మశానవాటికలో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం మున్సిపల్ వైస్ ఛైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి సందర్శించి నీటి సమస్య, పారిశుధ్య పనులు వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. దీంతో శనివారం ఉదయం నుంచే సిబ్బంది చెత్తతో నిండిన ప్రాంతంలో శుభ్రత పనులు చేపట్టారు.