ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ
TG: మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ వేర్వేరు అంశాలని పేర్కొంటూ PM మోదీకి CM రేవంత్ రెడ్డి లేఖ రాశారు. డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా కోటాను తక్షణమే అమలు చేయాలని కోరారు. పార్టీ ప్రయోజనాల కంటే జాతీయ ప్రయోజనాలే ముఖ్యమని, డీలిమిటేషన్ వల్ల బీజేపీకి లాభం ఉన్నా దేశానికి మాత్రం నష్టమని రేవంత్ స్పష్టం చేశారు.