కాంగ్రెస్ నాయకుల గెలుపు సంబరాలు
NRPT: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుండడంతో మరికల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు. బాణసంచా కాలుస్తూ జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి అంటూ నినాదాలు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం చౌరస్తాలో మిఠాయి పంపిణీ చేశారు. మండల అధ్యక్షుడు వీరన్న, పట్టణ అధ్యక్షుడు హరీష్ కుమార్ పాల్గొన్నారు.