VIDEO: బ్లాక్ మార్కెట్‌లో గ్యాస్ దందా..?
KMR: పిట్లం పట్టణంలోని HP గ్యాస్ ఏజెన్సీలో గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిర్దేశించిన ధర రూ.983 కాగా, అదనంగా మరో రూ.7 కలిపి రూ.990 వసూలు చేస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. అలాగే, సమయానికి సిలిండర్లు అందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీనిపై అధికారులు తక్షణమే స్పందించాలని వినియోగదారులు కోరుతున్నారు.