SSC పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం: DEO లలిత

SSC పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం: DEO లలిత

ఆసిఫాబాద్ జిల్లావ్యాప్తంగా SSC పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు DEO లలిత శుక్రవారం తెలిపారు. పరీక్షలకు మొత్తం 6,949 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రంలో హాల్ టికెట్, OMR షీట్ వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. ప్రశ్నా పత్రాన్ని పూర్తిగా చదువుకున్న తర్వాతే సమాధానాలు రాయాలని, ఎటువంటి ఒత్తిడికి లోనుకావద్దని పేర్కొన్నారు.