VIDEO: వ్యర్ధాల పొగతో.. అవస్థలు పడుతున్న స్థానికులు
BDK: పాల్వంచ మండలం ఎర్రగుంట గ్రామ సమీపంలొ మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్‌లో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. నిన్నటి నుంచి ఆ పొగకి స్థానికులు ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. గ్రామంలో ఉన్న గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు ఆ పొగతో వస్తున్న దుర్గంధంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని కోరారు.