VIDEO: గుండేపల్లిలో రోడ్డుపైకి డ్రైనేజీ నీరు
E.G: నల్లజర్ల మండలంలోని గుండేపల్లిలో ప్రధాన రహదారిపై డ్రైనేజీ నీరు చేరడంతో రోడ్డు చెరువును తలపిస్తోంది. నిత్యం విద్యార్థులు, ప్రజలు ఈ మార్గంలో వెళ్లేటప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు గురువారం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే ఈ సమస్యకు పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.