జాతరలో పాల్గొన్న జడ్పీటీసీ చల్లా శ్రీలక్ష్మి
NDL: అవుకు జడ్పీటీసీ సభ్యురాలు చల్లా శ్రీలక్ష్మి ఇవాళ సింగనమల మండలం కళ్ళుముడి గ్రామంలో పర్యటించారు. ఈ క్రమంలో గ్రామ జాతరలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గ్రామ వైసీపీ నాయకుడు నరసప్ప ఆహ్వానం మేరకు ఆమె పెద్దమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం కమిటీ సభ్యులు ఆమెను ఘనంగా సన్మానించారు.