‘నేడు రైతులకు యూరియా పంపిణీ’

MBNR: దేవరకద్ర ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు ఎరువుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 11, 2025న టోకెన్లు పొందిన రైతులకు యూరియా సరఫరా చేయనున్నారు. ఈ పంపిణీ కార్యక్రమం మంగళవారం ఉదయం 6:30 గంటలకు దేవరకద్రలోని గ్రోమోర్ సెంటర్ వద్ద ప్రారంభమవుతుంది. రైతులు తమ టోకెన్లతో సమయానికి హాజరై, తమకు సహకరించాలని సూచించారు.