'50% రాయితీతో మామిడి ఫ్రూట్స్ కవర్లు'
VZM: రాష్ట్ర ప్రభుత్వం 50% రాయితీతో మామిడి ఫ్రూట్స్ కవర్లు అందిస్తుందని ఉద్యానవన శాఖ అధికారి బీ దీప్తి మంగళవారం తెలిపారు. మామిడిలో ఈ ఫ్రూట్స్ కవర్లు వినియోగించడం ద్వారా మందుల ఖర్చు తగ్గించుకోవచ్చన్నారు. ఈ పంటకు మార్కెట్లో మూడు నుంచి ఐదు రెట్లు అధిక రేటు పలుకుతుందని ఆమె తెలిపారు. ఇందుకోసం రైతు సేవా కేంద్రం వద్ద సిబ్బందిని సంప్రదించాలన్నారు.