త్వరలో రాష్ట్రంలో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు: మంత్రి
కడప: త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. కడప రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆస్పత్రిని సందర్శించి రోగులకు అన్ని రకాల వైద్య చికిత్సలు అందుతున్నాయా లేదా అంటూ అరా తీశారు.