విద్యుత్ షాక్‌తో ఆవు మృతి
MHBD: నెల్లికుదురు మండలం బోటి మీది తండాకు చెందిన జాటోత్ నారికి చెందిన అవు మొక్కజొన్న చేనులో మేత మేస్తుండగా, ట్రాన్స్ ఫార్మర్ వద్ద ఉన్న కేబుల్ వైర్ చుట్టుకుని విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందింది. మృతి చెందిన ఆవు విలువ సుమారు రూ.75వేల వరకు ఉంటుందని బాధితురాలు తెలిపారు. సంబంధిత శాఖ అధికారులు నష్టపరిహారం అందించి తమను ఆదుకోవాలని కోరారు.