ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత

ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత

TG: అంబర్‌పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. బీజేపీ నాయకులు మోదీ.. మోదీ అంటూ నినాదాలు చేశారు. పోటాపోటీగా కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేశారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కాన్వాయ్‌ను కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. ఆందోళనకు దిగిన పోలీసులు కాంగ్రెస్ శ్రేణులను చెదరగొట్టారు.