తప్పిన పెను ప్రమాదం

తప్పిన పెను ప్రమాదం

VZM: అరకు విశాఖ రహదారిలో స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రక్కన మూడు షాపులు పైకి భారీ క్రేన్ అదుపుతప్పి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయం ఉదయం కావడంతో షాపులు తెరవకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే కొత్తవలస ప్రధాన రహదారికి ఇరువైపులా షాపులు వెలిస్తున్నప్పటికీ సంబంధిత అధికారుల చర్యలు శూన్యమని ప్రజలు మండిపడుతున్నారు.