పాకిస్తాన్‌కు కఠిన గుణపాఠం చెప్పాలి: ఒవైసీ

పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం జరిపిన దాడిని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్వాగతించారు. పహల్గామ్ తరహా దాడులు పునరావృతం కాకుండా పాక్‌కు కఠినమైన గుణపాఠం చెప్పాలని అన్నారు. 'పాకిస్తాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పూర్తిగా నాశనం చేయాలి.. జైహింద్' అని ఆయన 'X' వేదికగా పేర్కొన్నారు.