మోకాళ్లపై నిలబడి బీసీ నాయకుల నిరసన
MHBD: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట బీసీ హక్కుల సాధన సమితి నాయకులు మోకాళ్లపై నిలబడి నిరసనను తెలిపారు. BCల ద్రోహి బీజేపీయే అని, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. రిజర్వేషన్ల అమలుకై ప్రధాని మోదీపై రాష్ట్ర బీజేపీ నాయకులు ఒత్తిడి తీసుకురావాలన్నారు.