'దివ్యాంగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి'
ADB: దివ్యాంగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగుల సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని, బహిరంగ ప్రదేశాల్లో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అడ్డంకులు లేని వాతావరణం కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.