'వరద సహాయక చర్యలు తీసుకోవాలి'

'వరద సహాయక చర్యలు తీసుకోవాలి'

BPT: రేపల్లె కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లోని వరద ముంపు ప్రాంతాలపై గురువారం తహశీల్దార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని, అక్కడ కనీస వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆస్తి, ప్రాణ, పశు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని, అంటు వ్యాధులు ప్రబలకుండా చూడాలని సూచించారు.