VIDEO: లారీలను అడ్డుకున్న గ్రామస్థులు

VIDEO: లారీలను అడ్డుకున్న గ్రామస్థులు

TPT: కోట మండలం ఊనుగుంటపాలెంలో గురువారం మైనింగ్ లారీలను గ్రామస్థులు అడ్డుకున్నారు. స్థానికులు మాట్లాడుతూ.. ఈ లారీల మూలంగా గ్రామంలో రోడ్లు అస్తవ్యస్తంగా తయారు అయ్యాయని, రోడ్లు బాగు చేసి లారీలు తిప్పుకోవాలని డిమాండ్ చేశారు. మొన్న వచ్చిన వర్షాల కారణంగా మరీ ఎక్కువగా గుంతలు ఏర్పడ్డాయని వారు తెలిపారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని వారు కోరారు.