ఎస్. రాయవరంలో పర్యటించిన డిప్యూటీ ఎంపీడీవో
AKP: ఎస్. రాయవరం మండలం సైతారుపేట, వేమగిరి, సర్వసిద్ధి గ్రామాల్లో డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ఓ మంచినీటి ట్యాంకులను పరిశీలించారు. వాటిలో క్లోరినేషన్ చేయించారు. మంచినీటి ట్యాంకులను శుభ్రం చేయడంతో పాటు క్లోరినేషన్ కూడా చేయాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని వారికి తెలిపారు.