అన్నదాత సుఖీభవ చెక్కుల పంపిణీ

CTR: కార్వేటి నగరం మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో శనివారం 'అన్నదాత సుఖీభవ' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికే రైతులు వెన్నెముక లాంటి వారని అన్నారు. మన దేశంలో ఎన్నో రకాలుగా పండించే వ్యవసాయ పంటలను ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నామని తెలిపారు.