గంజాయి తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు
JN: గంజాయి తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదైన ఘటన దేవరుప్పుల మండలం సింగరాజు పల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై సృజన్ కుమార్ వివరాల ప్రకారం.. గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన అదే గ్రామానికి చెందిన సుద్దపల్లి అనిల్‌ను తనిఖీ చేయగా అతడి వద్ద 10 గ్రాముల గంజాయి లభించింది. కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచారు.