పెనమలూరులో వ్యక్తి గల్లంతు
కృష్ణా: పెనమలూరు(M) వడ్డెర ఇంద్రనగర్ కట్ట–1కి చెందిన దేవల దుర్గారావు గల్లంతైన ఘటన కలకలం రేపింది. మంగళవారం సాయంత్రం మద్యం మత్తులో యనమలకుదురు లాకులు వద్ద పెద్దపులిపాకకు వెళ్లే కాలువలో దూకినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. కుటుంబ కలహాలు, భార్య ఇంటి నుంచి వెళ్లిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన దుర్గారావు కనిపించకపోవడంతో తల్లి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.