సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

శ్రీకాకుళం: ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వరరావు సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. పేద ప్రజల ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం నిరంతరం సేవలు అందిస్తుందని అన్నారు. ఈ సహాయనిధితో ఆరోగ్యపరమైన తనిఖీలు చికిత్సల కోసం వినియోగించుకోవాలని అన్నారు. అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందజేయడం జరుగుతుందన్నారు.