నాగుర్ (బీ)లో విద్యుదాఘాతంతో ఎద్దు మృతి

నాగుర్ (బీ)లో  విద్యుదాఘాతంతో ఎద్దు మృతి

SRD: కంచె లేని ట్రాన్స్‌ఫార్మర్‌ ఓ ఎద్దును బలిగొంది. ఈ ఘటన కంగ్టి మండలంలోని నాగుర్‌(బీ) గ్రామ శివారులో చోటుచేసుకొంది. మండలంలోని సిద్ధంగిర్గా గ్రామానికి చెందిన ముంగె గోపాల్‌రెడ్డికి చెందిన ఎద్దు గ్రామశివారులో మేత మేస్తూ ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందింది. దాదాపు ఎద్దు విలువ రూ. లక్ష ఉంటుందని బాధితుడు తెలిపారు.