పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

NRPT: ధన్వాడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1982- 83లో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించుకున్నారు. తమకు పాఠాలు బోధించిన గురువులను సత్కరించి, పాఠశాల రోజులను గుర్తు చేసుకున్నారు. పదవ తరగతిలో తాము చేసిన చిలిపి చేష్టలను నెమరు వేసుకున్నారు.