వర్షపు నీరు నిలిచిన ప్రాంతాల్లో పర్యటించిన కార్పొరేటర్

RR: బీఎన్ రెడ్డినగర్ డివిజన్ పరిధిలోని పీవీఆర్ కాలనీ, పద్మావతి కాలనీ, మైల్ స్టోన్ కాలనీలో వర్షపు నీరు నిలిచింది. దీంతో స్పందించిన కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి జలమండలి అధికారులతో ఇవాళ మాట్లాడి వర్షపు నీరు పోయే విధంగా చర్యలు చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ.. డివిజన్‌లో వర్షపు నీరు నిలిచి ఉంటే సమాచారం ఇవ్వాలని తెలిపారు.