మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: మున్సిపల్ కమిషనర్

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: మున్సిపల్ కమిషనర్

NRML: నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా అధికారులు, సిబ్బంది మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని మంగళవారం ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. మత్తు పదార్థాలు వ్యక్తి, కుటుంబం, సమాజాన్ని నాశనం చేస్తాయని, అందరూ ఈ వ్యసనాలకు దూరంగా ఉండి ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు.