పార్కులను పరిశీలించిన హార్టికల్చర్ అధికారిణి

పార్కులను పరిశీలించిన హార్టికల్చర్ అధికారిణి

KMM: నగరంలోని పార్కులను హార్టికల్చర్ అధికారిణి రాధికా పరిశీలించారు. పార్కుల శుభ్రత, పూల మొక్కలు, చెట్ల పెంపకం, వాటి సంరక్షణ, నీటి సరఫరా వంటి అంశాలను పరిశీలిస్తూ సంబంధిత సిబ్బందికి తగు సూచనలు చేశారు. ప్రజలు విశ్రాంతి కోసం వినియోగించే పార్కుల్లో పచ్చదనం విస్తరించేందుకు, పార్కుల అందాన్ని కాపాడేందుకు శుభ్రతను క్రమం తప్పకుండా కొనసాగించాలన్నారు.