రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
అల్లూరి: పెదబయలు మండలం తామరాడ, సంపంగిపుట్టు గ్రామాల మధ్యలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ముంచంగిపుట్టు మండలానికి చెందిన మహేష్ అనే యువకుడు పెదబయలు వచ్చి స్నేహితులతో గడిపాడు. అనంతరం తిరిగి బైక్‌పై స్వగ్రామం వస్తుండగా తామరాడ, సంపంగిపుట్టు గ్రామాల మధ్యలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి లోయలో పడి, మృతి చెందాడు.