పెబ్బేరులో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
WNP: పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలోని సుభాష్ చంద్రబోస్ చౌరస్తాలో మండల అధ్యక్షులు వనం రాములు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కేసీఆర్‌పై రాజకీయ కక్షతో ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఎస్ఐటీ నోటీసులు చౌకబారు రాజకీయమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.