కమ్మేసిన మంచు దుప్పటి
RR: చేవెళ్ల నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మంచు దుప్పటి కమ్మేసింది. ఉదయం 6 గంటల నుంచే మంచు దట్టంగా కమ్ముకోవడంతో పనులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనదారులు దారి సరిగ్గా కనిపించక లైట్లు వేసుకొని ప్రయాణం కొనసాగిస్తున్నారు. గ్రామాల్లో ప్రజలు చలి, పొగ మంచుతో ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు.