కోదండరామాలయానికి గోమాత దానం
WNP: గోపాల్‌పేటలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయానికి నలువోతుల వెంకటేష్ రూ.30 వేల విలువైన గోవును దానంగా ఇచ్చారు. ఆలయ నిర్మాణానికి వందేళ్లు పూర్తైన సందర్భంగా ఈ దానం చేశారు. అర్చకుడు రంగాచార్యులు గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వీకరించారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.