అమరావతి రీలాంచ్‌కు జగన్‌కు ఆహ్వానం

అమరావతి రీలాంచ్‌కు జగన్‌కు ఆహ్వానం

GNTR: రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ఏపీ కూటమి ప్రభుత్వం మాజీ సీఎం జగన్‌ను ఆహ్వానించింది. తాడేపల్లి నివాసానికి వెళ్లిన ప్రోటోకాల్ అధికారులు జగన్‌ అందుబాటులో లేకపోవడంతో ఆయన వ్యక్తిగత సహాయకుడికి (పీఏ) ఆహ్వాన పత్రిక అందించారు. శుక్రవారం జరిగే ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల నాయకులను ఆహ్వానిస్తున్నట్లు సమాచారం.