చిరుత పులి సంచారంపై అవగాహన
MDK: తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచారం చేస్తుందని అటవీ శాఖ శిక్షణ అధికారి ఓం ప్రకాష్ తెలిపారు. మంగళవారం గుండ్రెడ్డిపల్లి గ్రామంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. చిరుత పులి సంచారం చేస్తున్నందున జాగ్రత్తలు పాటించాలని వివరించారు. ఒంటరిగా వెళ్లవద్దని, అటవీ సమీపంలో లేగదూడలు, గొర్రెలు, మేకలు ఉంచరాదన్నారు.