కమ్యూనిటీ హాలు నిధులు కేటాయించాలని ఎంపీకి వినతి
NZB: జిల్లా కేంద్రంలోని నాందేవ్ వాడ గుమాస్తా కాలనీలో గల దుర్గాదేవి ఆలయం వద్ద కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవడానికి నిధులు మంజూరు చేయాలని ఆలయ కమిటీ సభ్యులు శుక్రవారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కమిటీ అధ్యక్షుడు విజయ్ మాట్లాడుతూ.. తమ వినతికి ఎంపీ సానుకూలంగా స్పందించారని, త్వరలోనే నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారన్నారు.