మదనపల్లెలో కార్డెన్ సర్చ్ నిర్వహించిన అధికారులు

అన్నమయ్య: మదనపల్లెలోని బాబూ కాలనీలో సోమవారం ఉదయం పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఎస్పీ ఆదేశాలతో డీఎస్పీ మహీంద్ర, సీఐ, ఎస్ఐలు ప్రతి ఇంటినీ క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డులు సరిగా లేని వాహనాలను గుర్తించి సీజ్ చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ.. గంజాయి, సారాతో పాటు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడానికి కార్డెన్ సర్చ్ నిర్వహించామని తెలిపారు.