విద్యుత్ లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు

NGKL: పెద్దకొత్తపల్లి మండలం యాపట్ల గ్రామంలో 8వ వార్డులో రెండు రోజుల నుంచి విద్యుత్ సరఫరా జరగడం లేదు. దీంతో గ్రామస్తులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించి మరమ్మత్తులు చేయించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.