మహిళ వీడియో తీస్తూ అసభ్య ప్రవర్తన.. కేసు నమోదు

మహిళ వీడియో తీస్తూ అసభ్య ప్రవర్తన.. కేసు నమోదు

NDL: బనగానపల్లె మండలం, నందివర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నందవరం చౌడేశ్వరి మాత ఆలయ సమీపంలో మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయిపై కేసు నమోదు చేసినట్లు నందివరం ఎస్ఐ బీటీ వెంకటసుబ్బయ్య వెల్లడించారు. నందవరం గ్రామానికి చెందిన ఓ యువకుడు దైవ దర్శనానికి వచ్చిన భక్తురాలి వీడియో తీస్తూ అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.