రూ.15 లక్షలతో సీసీ రోడ్డు పనులు షురూ
VKB: మర్పల్లి మండలం బిల్కల్ గ్రామాభివృద్ధికి మరో అడుగు పడింది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో, రూ.15 లక్షల ఉపాధి హామీ నిధులతో సీసీ రోడ్డు పనులను సోమవారం సర్పంచ్ ఆనంద్ ప్రారంభించారు. మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తున్నందుకు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దత్తు గౌడ్, ప్రభాకర్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.