విశేష అలంకరణలో వరాల ఆంజనేయస్వామి
అన్నమయ్య: మదనపల్లె పట్టణంలోని శ్రీ వరాల ఆంజనేయస్వామి విశేష అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారికి వేకువజామునే అభిషేకాలు నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలు తమలపాకులు తులసి మాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.