మహనీయులను దేశానికి అందించిన పార్టీ
RR: బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొందుర్గు మండలం తంగేళ్లపల్లి గ్రామంలో బీజేపీ గ్రామ అధ్యక్షులు లక్ష్మణ్ బీజేపీ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారత జాతి గౌరవాన్ని కాపాడి ఎందరో మహనీయులను దేశానికి అందించిన పార్టీ బీజేపీ అన్నారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.